రాజ్ భవన్లో ఎట్ హోం..హాజరు కాని బీఆర్ఎస్ నేతలు

రాజ్ భవన్లో ఎట్ హోం..హాజరు కాని బీఆర్ఎస్ నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం వేడుకగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎట్ హోంకు హాజరైన అతిథులకు తేనీటి విందు ఇచ్చారు గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్. 

ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున రాజ్ భవన్ లో  ప్రముఖులకు గవర్నర్ తేనీటి విందు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ తేనీటీ విందుకు మాజీ సీఎం కేసీఆర్ గానీ, కేటీఆర్,హరీశ్ రావులు గానీ ముఖ్య నేతలెవ్వరూ హాజరుకాలేదు. బీజేపీ నుంచి పలువురు కీలక నేతల హాజరయ్యారు.