ఢిల్లీకి గవర్నర్ తమిళి సై.. వారంలో రెండోసారి!

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై.. వారంలో రెండోసారి!

గవర్నర్ తమిళి సై  ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న గవర్నర్ అక్కడినుండి నేరుగా ఢిల్లీ వెళ్ళనున్నారని  తెలుస్తోంది.  కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఈ పర్యటనలో గవర్నర్ తమిళి సై తెలంగాణలో తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గడిచిన వారం రోజుల్లో తమిళి సై ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.