కార్పెట్పై నడుస్తుండగా కిందపడ్డ గవర్నర్

కార్పెట్పై నడుస్తుండగా  కిందపడ్డ గవర్నర్

రాష్ట్ర గవర్నర్ తమిళి సై కిందపడ్డారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన తమిళి సై.. కార్పెట్ పై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్‌ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ తాను కిందపడిన ఈ వార్త టీవీల్లో హైలైట్ అవుతుందంటూ సరదాగా అన్నారు.

హైబ్రిడ్ రాకెట్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రసంగించారు. ఆ తర్వాత ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కార్పెట్‌పై జారి పడిపోయారు. సుమారు 3500 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 6 నుంచి 12వ తరగతి చదివే 5వేల మంది విద్యార్థులు తయారుచేసిన 150 మినీ హైబ్రిడ్‌ ఉపగ్రహాల (పైకో శాటిలైట్స్‌)ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ప్రయోగాన్ని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఇంటర్నే షనల్‌ ఫౌండేషన్‌, మార్టిన్‌ ఫౌండేషన్‌, స్పేస్‌ జోన్‌ ఇండియా సంయుక్తం గా చేపట్టాయి.