తన చిత్రాన్ని గీసిన చిన్నారికి గవర్నర్ అభినందన

V6 Velugu Posted on Jul 25, 2021

తన చిత్రాన్ని గీసి ట్విట్టర్ లో ట్యాగ్ చేసిన చిన్నారిని అభినందించారు గవర్నర్ తమిళి సై. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సాయిబండ తండాకి చెందిన ఫ్లోరోసిస్ బాధితురాలు రమావత్ సువర్ణ గవర్నర్ తమిళి సై చిత్రాన్ని గీశారు. దానిని NRI జలగం సుధీర్ గవర్నర్ కు ట్యాగ్ చేసి ట్విట్టర్ పోస్టు చేశారు. దీంతో సువర్ణతో పాటు ఆమె కుటుంబ సభ్యులను రాజ్ భవన్ కు పిలిపించుకుని మాట్లాడారు గవర్నర్ తమిళిసై. సువర్ణకు ట్రై సైకిల్ బహుకరించారు. వారితో కలిసి భోజనం చేసి సువర్ణ చదువుతో పాటు ఆమెకు అవసరమైన సహాయ  సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. 

 

Tagged RajBhavan, Governor tamilisai Presente, motorize, tricycle , fluorosis-affecte, girl Suvarna

Latest Videos

Subscribe Now

More News