
రాజ్ భవన్ కాదు ఇది ప్రజా భవన్ అని అన్నారు గవర్నర్ తమిళిసై. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ ను గవర్నర్ ఆఫీస్ గా మార్చామన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగుందన్నారు.తెలంగాణ గవర్నర్ గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు తమిళిసై సౌందరరాజన్. ఈ సందర్భంగా మాట్లాడారు.
వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించడం కోసం తండాల్లోని గిరిజనుల మధ్య వ్యాక్సిన్ వేసుకున్నానని తెలిపారు. కరోనాపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు. నిమ్స్ తో పాటు కొన్ని ఆస్పత్రుల్లోని కోవిడ్ పేషంట్ లను పరామర్శించానని అన్నారు. పేదరికంతో చాలా మందికి ఆన్లైన్ క్లాస్ లు వినడానికి ఇబ్బంది గా ఉంది అంటే NGO సహకారంతో 5గురికి ల్యాప్ టాప్ లు కూడా ఇప్పించామన్నారు.
ఆదిలాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ లో ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కొంత న్యూట్రిషన్ సమస్యలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఆసమస్య కొంత సమస్య తగ్గిందన్నారు. కరోనా కారణంగా ఆదివాసీ గిరిజన ప్రాంతలకు వెళ్లలేక పోయానని..పరిస్థితిలు కొంత తగ్గు ముఖం పట్టిన తర్వాత కచ్చితంగా వెళ్తానన్నారు.
గవర్నర్ గా నాకు.. సీఎం కేసీఆర్ కు ఎలాంటి రాజకీయ పరమైన విభేదాలు లేవని తెలిపారు తమిళిసై. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పై నామిని నామినేషన్ పై పూర్వ పరాలు పరిశీలిస్తున్నానని..ఆమోదించడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ కంట్రీ అన్న గవర్నర్ తమిళిసై..పుదుచ్చేరిలో పెట్రోల్ పై 2శాతం వ్యాట్ తగ్గించాని తెలిపారు.