ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే సవాళ్లను అధిగమించాలి: తమిళిసై

ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే సవాళ్లను అధిగమించాలి: తమిళిసై

ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే విద్యార్థులు తమ జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. టీచింగ్ వృత్తితో పాటు విద్యార్థులను నియంత్రించడం సులభమైన పనికాదని చెప్పారు. పిల్లలను నియంత్రించటం ఎంత కష్టమో కరోనా టైంలో ప్రతి పేరెంట్కు అర్థమైందన్నారు.  మహబూబ్ నగర్లో  పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. 

కృషి , పట్టుదలతో ఉన్నత విద్యలో  రాణించి గోల్డ్ మెడల్ పొందిన విద్యార్థులకు , ఫ్యాకల్టీకి, తల్లిదండ్రులకు తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. దేశంలో నేటి విద్యావిధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.  క్లిష్టమైన టైంలో కరోనాకు వ్యాక్సిన్ కనుగొని ఇండియా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని నిరూపించిందన్నారు. అటు పూర్వ విద్యార్థులపై యూనివర్సిటీల భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు.