గిరిజన స్టూడెంట్లకు స్కిల్ కోర్సులు నేర్పించాలి: గవర్నర్ తమిళిసై

గిరిజన స్టూడెంట్లకు స్కిల్ కోర్సులు నేర్పించాలి: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు : గిరిజన స్టూడెంట్లకు స్కిల్  డెవలప్ మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై అన్నారు. రెగ్యులర్ కోర్సులకు అనుగుణంగా కమ్యూనికేషన్, టెక్నాలజీ  బేస్డ్ అంశాలలో ప్రత్యేక ట్రైనింగ్ అందిచాలని ఆమె సూచించారు. ‘లాజిక్  బిల్డింగ్ స్కిల్స్ ఆదివాసీ ఎస్టీ స్టూడెంట్స్’  అంశంపై వరంగల్  నిట్  నిర్వహించిన రెండు వారాల ట్రైనింగ్  పోగ్రాం ముగింపు సందర్భంగా ఆదివారం రాజ్ భవన్ నుంచి గవర్నర్  వర్చువల్ గా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన కొత్త విద్యా విధానంలో స్టూడెంట్లు ప్రపంచ స్థాయిలో ముందుకు వెళ్లేందుకు పలు మార్పులు చేశారని ఆమె తెలిపారు.

రోబోటిక్స్, కమ్యూనికేషన్  స్కిల్స్, పెయిటింగ్ పై రెండు వారాల ట్రైనింగ్  నిర్వహించిన నిట్  వరంగల్ అధికారులను అభినందించారు. పలువురు విద్యార్థులకు తన విచక్షణా అధికారాల కింద ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేస్తున్నానని తెలిపారు.