జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు : గవర్నర్ వీకే. సక్సేనా

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు : గవర్నర్ వీకే. సక్సేనా
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడపడం కుదరదని లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ)  వీకే. సక్సేనా భరోసా ఇచ్చారు. అర్వింద్ కేజ్రీవాల్ కటకటాల వెనుక ఉన్నప్పటికీ సీఎంగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో ఎల్జీ వీకే. సక్సేనా ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎల్జీ ఓ సమిట్ లో పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

 ‘‘ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడపడం కుదరదు. అందుకు నేను హామీ ఇస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు కింద కేజ్రీవాల్‌‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ నెల 28 వరకూ ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. అయినప్పటికీ జైలు నుంచే ఆయన ఆదేశాలు ఇస్తూ పాలననను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్జీ ఈ విధంగా వ్యాఖ్యానించారు.