
కేంద్ర ప్రభుత్వం నుంచి గాంధీ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కుటుంబానికి ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) రక్షణను రద్దు చేసింది. వారికి జెడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు సమాచారం. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి ఉంది.
గతంలో మాజీ పీఎం మన్మోహన్ సింగ్ కుటుంబానికి కూడా కేంద్రం ఎస్పీజీ భద్రత తొలగించింది. ఎస్పీజీ భద్రతను కల్పించేంత స్థాయిలో వారికి థ్రెట్ లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.