ఫేస్‌ టూ ఫేస్‌ మీటింగులు లేవు.. 20 మందికంటే ఎక్కువ స్టాఫ్‌ వద్దు

ఫేస్‌ టూ ఫేస్‌ మీటింగులు లేవు.. 20 మందికంటే ఎక్కువ స్టాఫ్‌ వద్దు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త గైడ్‌లైన్స్‌
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో జారీ చేసిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రూల్స్‌ జారీ చేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ పర్సనల్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ అండ్‌ పెన్షన్స్‌ మంగళవారం కొత్త సర్క్యూలర్‌‌ను పాస్ చేసింది. కేవలం లక్షణాలు లేని వారు మాత్రమే ఆఫీస్‌కు రావాలని చెప్పింది. ఏ మాత్రం దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా ఇళ్లలోనే ఉండాలని చెప్పింది. కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నవారు కచ్చితంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సర్క్యూలర్‌‌లో చెప్పారు. రోజుకు 20 మంది స్టాఫ్‌ మాత్రమే ఆఫీస్‌కు రావాలని, ఈ మేరకు డ్యూటీ చార్ట్‌ ప్రిపేర్‌‌ చేసుకోవాలని ఆడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. క్యాబిన్‌ను షేర్‌‌ చేసుకునే ఎంప్లాయిస్‌ డే బై డే ఆఫీస్‌కు రావాలని చెప్పారు. ఢిల్లీలోని నీతిఆయోగ్‌, ఈడీ, కేంద్ర ఎన్నికల కార్యాలయాల్లోని ఆఫీసర్లకు కరోనా సోకింది. దీంతో ఆ బిల్డింగులను సీజ్‌ చేసిన అధికారులు శానిటైజేషన్‌ చేసిన తర్వాత తిరిగి తెరిచారు. ఆ కార్యాలయాల్లో ఉన్నవారిని హమ్‌ క్వారంటైన్‌కు తరలించారు.

సర్క్యూలర్‌‌లోని రూల్స్‌:

  • ఆఫీస్‌లో ఉన్నంత సేపు ఫేస్‌ మాస్కులు, ఫేస్‌ ఫీల్డులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. లేనిపక్షంలో డిసిప్లైనరీ యాక్షన్‌ తీసుకుంటాం.
  • ఒకసారి వాడిన గ్లౌజులు, ఫేస్‌మాస్కులును బయో మెడికల్‌ వేస్ట్‌ బిన్‌లో మాత్రమే వేయాలి. లేకపోతే చర్యలు తప్పవు.
  • ఫేస్‌ టూ ఫేస్‌ మీటింగ్స్‌, ఇంటరాక్షన్స్‌పై నిషేధం. ఫోన్‌, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీటింగులు నిర్వహించాలి.
  • ప్రతి అరగంటలకు చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • ఫ్రీక్వెంట్‌గా ఉపయోగించే స్విచ్చులు, డోర్లు, ఎలివేటర్‌‌ బటన్స్‌ లాంటివి కచ్చితంగా గంటకు ఒకసారి క్లీన్‌ చేయించాలి.
  • స్టాఫ్‌ మెంబర్స్‌ కూడా తమ పర్సనల్‌ కీ బోర్డ్స్‌, మౌస్‌లు, ఫోన్‌, ఏసీ రిమోట్లను కూడా శానిటైజ్‌ చేసుకోవాలి.
  • కనీసం 1 మీటరు దూరం పాటించాలి. సోషల్‌ డిస్టెంసింగ్‌ కచ్చితంగా పాటించాలి.