పన్నుల వసూళ్ల విలువ రూ. 34 లక్షల కోట్లు

పన్నుల వసూళ్ల విలువ రూ. 34 లక్షల కోట్లు

న్యూఢిల్లీ:  పటిష్టమైన ఆర్థిక కార్యకలాపాల వల్ల కేంద్ర ప్రభుత్వం 2023-–24 సంవత్సరానికి రూ. 34.37 లక్షల కోట్లకు పైగా పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంది.  2024 ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ. 19.45 లక్షల కోట్లకు పెంచగా, పరోక్ష పన్నుల (జీఎస్టీ+ కస్టమ్స్ + ఎక్సైజ్) లక్ష్యాన్ని రూ. 14.84 లక్షల కోట్లకు తగ్గించారు. ఈ ఏడాది మార్చి 17 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (కార్పొరేట్ పన్ను  వ్యక్తిగత ఆదాయపు పన్నుతో కలిపి) రూ. 18.90 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

జీఎస్టీ ఏప్రిల్ 2023లో రికార్డు స్థాయిలో రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుంది.  మార్చి 2024లో రూ. 1.78 లక్షల కోట్లతో రెండవ అత్యధిక వసూళ్లు రాబట్టడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ అధిక స్థాయికి చేరుకుంది. సవరించిన అంచనా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరానికి స్థూల పన్ను వసూలు లక్ష్యం రూ.34.37 లక్షల కోట్లు.