సర్కార్ ఆఫీసుల్లో కొత్త రూల్ : లంచం తీసుకోవద్దని ప్రతిజ్ఞ

సర్కార్ ఆఫీసుల్లో కొత్త రూల్ : లంచం తీసుకోవద్దని ప్రతిజ్ఞ

సర్కార్ ఆఫీసుల్లో అవినీతి తగ్గించేందుకు కొత్త రూల్ ఫాలో అవుతున్నారు ఉన్నతాధికారులు.  తమ విధుల్లో లంచం తీసుకోబోమని…. ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సూచిస్తున్నారు. అంతే కాదు తమకు ఇష్టమైన వారిపై ప్రమాణం కూడా చేయిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ క్రాంతి.. మా భరోసా పేరుతో ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. జడ్చర్ల మండల కార్యాలయంలో మా భరోసా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాని చెప్పారు. ప్రతీ మండల కేంద్రంలో అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో ప్రమాణం చేయిస్తామన్నారు. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, అవినీతికి పాల్పడకుండా విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

ప్రతీ ఒక్కరికి ప్రతిజ్ఞకు సంబందించిన కాపీ ఇచ్చి… దానిపై ఉద్యోగి పేరు, అర్హత… సంతకం చేయిస్తున్నారు. మా భరోసా కార్యక్రమంలో కాల్ సెంటర్ ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా… ప్రభుత్వ అధికారులు సరిగా పనిచేయకపోయినా…. కాల్ సెంటర్ కి ఫోన్ చేసి చెప్పాలన్నారు. ఇప్పటికి వచ్చిన కంప్లైంట్లలో ఎక్కువగా భూమికి సంబంధించినవేనని చెప్పారు. జడ్చర్లలో జరిగిన మా భరోసా కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రభుత్వ అధికారులు ప్రతిజ్ఞ చేశారు.