సెన్సార్ బోర్డు అవినీతిపై విచారణ

సెన్సార్ బోర్డు అవినీతిపై విచారణ

తమిళ స్టార్ హీరో విశాల్‌ ముంబయి సెన్సార్‌ అధికారులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసందే. ఆయన లేటెస్ట్ మూవీ మార్క్‌ ఆంటోని హిందీ సెన్సార్‌ పనుల కోసం అధికారులకు 6.5లక్షలు లంచంగా ఇచ్చానని డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా.. ముంబయి సెన్సార్‌ బోర్డులో అవినీతి పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు.

అయితే.. విశాల్ చేసిన ఈ కామెంట్స్ పై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరం అని పేర్కొంది. ఈ మేరకు విశాల్ కామెంట్స్ తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దర్యాప్తు కోసం MIB నుండి సీనియర్ అధికారిని నియమించింది. 

ALSO READ : Skanda First day collections: స్కంద ఊరమాస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ మాస్ జాతర

 నటుడు విశాల్ కు CBFCలో ఎదురైనా అనుభవం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదు. ఈ వివాదంలో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుండి ఒక సీనియర్ అధికారి ఈ విచారణ కోసం నియమిస్తున్నాం. ఈరోజే విచారణ జరపాలి అని MIB ట్వీట్‌లో పేర్కొంది.