
మాస్ దర్శకుడు బోయపాటి(Boyapati srinu), ఉస్తాద్ హీరో రామ్(Ram) కాంబోలో వచ్చిన స్కంద(Skanda) మూవీ ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆడియన్స్ నుండి ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చినా అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఫస్ట్ డే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.18. 2 కోట్లు వసూళ్లను రాబట్టగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.62 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాకు అత్యధికంగా నైజాం ఏరియాలో రూ.3.23 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ALSO READ : సెన్సార్ బోర్డు అవినీతిపై విచారణ
ఇక రానున్న రెండు మూడు రోజులు కూడా సెలవుదినాలు కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక స్కంద సినిమా విషయానికి వస్తే.. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు మాస్ ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక హీరో రామ్ కూడా కెరీర్ లో ఫస్ట్ టైం ఊర మాస్ క్యారెక్టర్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బోయపాటి టేకింగ్, తమన్ మ్యూజిక్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.