భారత్‌లో వ్యాక్సిన్ తో మొదటి మృతి

భారత్‌లో వ్యాక్సిన్ తో మొదటి మృతి

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఓ వ్యక్తి భారత్‌లో మొదటి సారిగా చనిపోయాడు. కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై  స్టడీ చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్ అడ్వేర్సే ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునిసేషన్ (AEFI) .. ఇండియాలో వ్యాక్సిన్ తర్వాత తొలి మరణాన్ని కన్ఫాం చేసింది. ఓ 68 ఏళ్ల వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనఫిలాక్సిస్‌తో చనిపోయినట్లు తేల్చింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన 31 మందిలో కలిగిన తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ పై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అందులో ఒక వ్యక్తి మాత్రం అనఫిలాక్సిస్ తో చనిపోయినట్లు AEFI ప్యానెల్ తేల్చింది.

ఆ వ్యక్తి మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్నాడని ప్యానెల్ రిపోర్ట్ చెప్పింది. వ్యాక్సినేషన్ తర్వాత కలిగే అనఫిలాక్సిస్ కారణంగా చనిపోయిన మొట్ట మొదటి వ్యక్తిగా AEFI ప్యానెల్ తేల్చింది. అనఫిలాక్సిస్ అంటే ఒక తీవ్రమైన ఎలర్జీ. నిజానికి మరో ముగ్గురు కూడా వ్యాక్సిన్ కారణంగానే చనిపోయినా.. ప్రభుత్వం మాత్రం ఇదొక్క మరణాన్నే కన్ఫాం చేసింది. వ్యాక్సిన్ సంబంధిత ఇలాంటి రియాక్షన్లు ముందుగా ఊహించినవే అని ప్యానెల్ చెప్పింది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా వ్యాక్సిన్ తర్వాత అనఫిలాక్సిస్ బారిన పడినా.. వాళ్లు చికిత్స తర్వాత  కోలుకున్నారు.