గిగ్ ఎకానమీ వర్కర్లకు త్వరలో సెంట్రల్ గవర్నమెంట్ తీపికబురు చెప్పనుంది. దేశంలోని 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ స్కీం ప్రకటించే ఛాన్స్ ఉందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. డెలివరీ బాయ్స్, ఫ్రీలాంన్స్ వర్కర్లు, ఇతన అసంఘటిన రంగంలో పని చేస్తున్న కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకు వారి వేతనం నుంచి 1 లేదా 2 శాతం తీసుకుంటారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకోవడం, ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించవచ్చని ప్రభుత్వ వర్గంలో చర్చ నడుస్తోంది.
Also Read :- అమ్మకాలు లేవు.. మీ ఉద్యోగాలు పీకేస్తున్నాం
గిగ్ కార్మికుల కోసం సామాజిక భద్రతా స్కీం బ్లూప్రింట్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)కు వచ్చినట్లు సమాచారం. ఈ పథకాన్ని ఖరారు చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా సెప్టెంబర్ 7న అధికారులతో సమావేశమైనట్లు కూడా తెలసుస్తోంది. గిగ్ ఎకానమీ ప్లాట్‌ఫారమ్‌లు, అగ్రిగేటర్లతో మీటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. క్యాబినెట్‌కు సమర్పించడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అధికారులను నేషనల్ న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. ఈ పథకం గురించి పూర్తి సమాచారం ఇంకా ప్రకటించలేదు.
ఈ శ్రమ్ పోర్టల్ లో గిగ్ ఎకానమీ కార్మికులు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 30 కోట్ల మంది ఈ శ్రమ్ పోర్టల్ లో వారి పేర్లు నమోదు చేసుకున్నారు. లేబర్ చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా గిగ్ ఎకానమీ కంపెనీలతో చర్చించాక స్కీం వివరాలు తెలుస్తాయి.