1500 చట్టాలు తొలగించాం..ఇంకా తొలగిస్తాం

1500 చట్టాలు తొలగించాం..ఇంకా తొలగిస్తాం

సామాన్యులకు భారంగా మారిన సుమారు 1500 కాలం చెల్లిన చట్టాలు,నిబంధనలను కేంద్రప్రభుత్వం ఇప్పటికే తొలగించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఇంకా అవసరం లేని చట్టాలను గుర్తించే  పనిలో ఉన్నామన్నారు. శ్రీనగర్ లో జరిగిన హైకోర్టు కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బ్రిటీష్ కాలం నాటి చట్టాల్లో ఇప్పడు అవసరం లేని  వాటిని గుర్తించి తొలగిస్తామన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు రాజద్రోహం  చట్టాన్ని  పున:సమీక్ష చేయాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో కిరణ్ రిజుజు  చేసిన  కామెంట్స్  హాట్ టాపిక్ గా మారాయి.