ఎయిర్ పోర్టులను ప్రభుత్వం నడపకూడదు: హర్దీప్ పురి

ఎయిర్ పోర్టులను ప్రభుత్వం నడపకూడదు: హర్దీప్ పురి

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎయిర్ పోర్ట్స్ ను నడిపించొద్దని సివిల్ ఏవియేషన్ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఈ ఏడాది ముగిసేలోపు కేంద్రం విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఎయిర్ పోర్ట్ ను అదానీ ఎంటర్ ప్రైజెస్ కు పీపీపీ మోడల్ కింద 50 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ కేంద్ర కేబినెట్ అప్రూవల్ చేసింది. దీన్ని కేరళ రాష్ట్ర సర్కార్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో హర్దీప్ పురి పైవ్యాఖ్యలు చేశారు. ‘నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా.. ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ లను నిర్వహించకూడదు. అలాగే ఎయిర్ లైన్స్ ను కూడా నడపకూడదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇది బిడ్డర్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. మేం ప్రైవేటీకరణ (ఎయిర్ ఇండియాను) చేయాల్సిందే. ఈ ఏడాదిలోనే ఆ ప్రక్రియను మేం ముగిస్తామని ఆశిస్తున్నా’ అని పురి పేర్కొన్నారు.