Hari Hara Veera Mallu: ‘కుబేర’, ‘కన్నప్ప’ ఎఫెక్టేనా..? పవన్ ఫ్యాన్స్ ఖుషీ.. ‘హరిహర వీరమల్లు’ రన్ టైం ఎంతంటే..

Hari Hara Veera Mallu: ‘కుబేర’, ‘కన్నప్ప’ ఎఫెక్టేనా..? పవన్ ఫ్యాన్స్ ఖుషీ.. ‘హరిహర వీరమల్లు’ రన్ టైం ఎంతంటే..

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్‌ యాక్షన్ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’. ఈ మూవీని దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతికృష్ణ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షూట్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరించాడు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మించారు. ఈ మూవీ జులై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. 

‘హరి హర వీరమల్లు’మూవీ రన్‍టైమ్ ఎంతనేది ఇపుడు వైరల్ అవుతుంది. లేటెస్ట్గా ఓ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో మూవీ రన్‌టైమ్‌ 2.40 గంటలు ఉండనుంది వెల్లడించింది. ఈ క్రమంలోనే మూవీ రన్‌టైమ్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, ఈ విషయంపై అటూ మేకర్స్ నుంచి, ఇటూ సెన్సార్ నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ తమ సైట్లో పెట్టిందందంటే అలోమోస్ట్ ఇంతే ఉండనుందని సినీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Also Read : పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు'పై వివాదం

సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలకు మూడు గంటల రన్‌ టైమ్‌ ఉండేలా మేకర్స్ ప్లాన్‌ చేస్తారు. కానీ మేకర్స్ తెలివిగా 20 నిమిషాలు తగ్గించారని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిడివి తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉంటుంది అనేది సినీ ఫ్యాన్స్లో, క్రిటిక్స్లో టాక్‌ నెలకొంది.

ఇటీవలే, కుబేర సినిమా 3 గంటల 10 నిమిషాలు రన్ టైంతో వచ్చింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్లు సాధించింది. కానీ, మూవీ రన్ టైం ఎక్కువైందనే టాక్ మరింత వచ్చింది. ఇంకాస్తా తగ్గించుంటే బెటర్ ఉండేదని సినీ క్రిటిక్స్ చర్చించుకున్నారు.

ఇక కన్నప్ప మూవీ సైతం  3 గంటల 10 నిమిషాలతో వచ్చి అదే టాక్ అందుకుంది. ఇపుడు వీరమల్లు టీమ్ జాగ్రత్తలు తీసుకుని.. మంచి అనువైన రన్ టైంతో వస్తుండటంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.