Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు'పై వివాదం: చరిత్ర వక్రీకరించారంటూ ఆరోపణలు

 Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు'పై వివాదం:   చరిత్ర వక్రీకరించారంటూ ఆరోపణలు

ఎన్నో వాయిదాల  తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) నటించిన ' హరి హర వీరమల్లు ' జూలై 24 , 2025న ( Hari Hara Veera Mallu release date)  ప్రేక్షకుల  ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.  బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయం అని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  అయితే  థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్న తరుణంలో ఈ మూవీపై కొత్త వివాదంలో తెరపైకి వచ్చింది.  ఈ చిత్రంలో ఒక కీలక వ్యక్తిని తప్పుగా చూపించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు విషయంలోకి వెళితే ..  నిజాం కాలంలో ఫ్యూడల్ భూస్వాములకు  వ్యతిరేకంగా పోరాడిన 19వ శతాబ్దపు తెలంగాణ జానపద వీరుడు పండుగ సాయన్న. అయితే ఈయన వారసత్వాన్ని ఈ మూవీలో వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నారు.  ముఖ్యంగా ముదిరాజ్ కమ్యూనిటీ సభ్యులు ..   ' హరి హర వీరమల్లు ' చిత్రంలో  వీరమల్లు ( పవన్ కళ్యాణ్ ) పాత్ర పండుగ సాయన్నను పోలి ఉందని పేర్కొంటున్నారు.   ఆయన్ని తప్పుదోవ పట్టించే , కల్పితమైన కథనంతో చిత్రీకరించారని మండిపడుతున్నారు. ఆ పాత్ర యొక్క చారిత్రక, సాంస్కృతిక అంశాన్ని పలుచన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇది  ఆ వీరుడి యొక్క వారసత్వాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.  

అయితే ముదిరాజ్ కమ్యూనిటీ సభ్యుల ఆరోపణలు, విమర్శలపై చిత్ర బృందం మాత్రం ఇంకా స్పందించ లేదు.  కానీ  ' హరి హర వీరమల్లు '  లో ప్రధాన పాత్రధారి వీరమల్లుపై మాత్రం వివాదం మరింత రాజకుంటుంది.  సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. చారిత్రాత్మక పాత్రల చిత్రీకరణ విషయంలో మరింత సున్నితత్వం పాటించాల్సి ఉందని డిమాండ్ చేయడంతో పాటు సూచనలు ఇస్తున్నారు నెటిజన్లు.

ALSO READ : రవితేజ ఫ్యామిలీ నుంచి.. మాధవ్ హీరోగా ‘మారెమ్మ’

హరి హర వీర మల్లు ఒక భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం. మొఘల్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించగా, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, శక్తివంతమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి. విలన్‌గా బాబీ డియోల్ కనిపించగా, ఇది సినిమా డ్రామాకు మరింత జోడించింది.  మరి ముదిరాజ్ కమ్యూనిటీకి  ఈ మూవీ మేకర్ ఎలాంటి వివరణ ఇవ్వనుందో చూడాలి .