ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్.. రూ.3 కోట్లు, లగ్జరీ కారు వసూలు.. ముంబైలో CA సూసైడ్

ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్.. రూ.3 కోట్లు, లగ్జరీ కారు వసూలు.. ముంబైలో CA సూసైడ్

లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలి.. ఎలాంటి జాబ్ చేయాలి.. అని సక్సెస్ కోసం కొందరు ఎదురు చూస్తుంటే.. ఎవడ్ని ట్రాప్ చేయాలి.. ఎలాంటి సీక్రెట్స్ తెలుసుకుంటే డబ్బు దొరుకుతుంది.. ఎలా బ్లాక్ మెయిల్ చేయాలని కొందరు పనిగా పెట్టుకుని దారుణమైన క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. అలాంటి స్టోరే ఇది. పెద్ద కంపెనీలో పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ వీక్ పాయింట్స్ తెలుసుకుని.. మూడు కోట్ల రూపాయలు వసూలు చేయడమే కాకుండా.. అతని మరణానికి కారకురాలయ్యింది ఒక యువతి. 

వివరాల్లోకి వెళ్తే.. ముంబై శాంటాక్రూజ్ ఏరియాలో రాజ్ లీలా (32) అనే యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్ విషం తాగి చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. మంచి జీతం, కంపెనీ ఆర్థిక లావాదేవీలు అన్నీ తన చేతిలో ఉండేంత పెద్ద పొజిషన్ లో ఉన్న రాజ్ చనిపోవడం పలు అనుమానాలకు దారితీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తులో రాజ్ మృతికి గల కారణాలను రాసిపెట్టిన సూసైడ్ నోట్ లభ్యమవటంతో షాక్ కు గురయ్యారు పోలీసులు.

కంపెనీలో డబ్బులు తీయమని ఒత్తిడి చేసిన ఆ ఇద్దరు:

తన చావుకు కారణాన్ని మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు రాజ్. రాహుల్ పర్వానీ, సబా ఖురేషీ అనే ఇద్దరి కారణంగానే చనిపోతున్నట్లు పేర్కొన్నాడు. ఈ ఇద్దరూ కలిసి తన కంపెనీ నుంచి డబ్బులు డ్రా చేయాలని ఒత్తిడి చేసినట్లు లేఖలో రాశాడు. లేఖ ఆధారంగా ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మంచి శాలరీ వచ్చే జాబ్ చేస్తున్న రాజ్... స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే రాజ్ పనిచేస్తున్న కంపెనీ నుంచి భారీ మొత్తంల తమ ఖాతాల్లోకి ట్రాన్ ఫర్ చేయాని ఒత్తిడి చేసినట్లు చెప్పారు పోలీసులు. 

సూసైడ్ నోట్ లో ఏముంది..?

రాజ్ లెటర్ ప్రకారం.. రాహుల్ పర్వానీ,  సభా ఖురేషీ ఇద్దరూ గత 18 నెలలుగా రాజ్ ను టార్చర్ చేస్తున్నట్లు తెలిసింది. కంపెనీ అకౌంట్స్ నుంచి మొత్తం 3 కోట్ల రూపాయలు డ్రా చేయించినట్లు పేర్కొన్నాడు. అంతే కాకుండా లగ్జరీ కారు ను కూడా రాజ్ నుంచి లాగేసినట్లు గుర్తించారు. 

చనిపోయేముందు రాసిన లేఖలో.. ‘‘ నేను మీకు మంచి కొడుకులా ఉండలేకపోతున్నారు. మీరు నాపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాను. పర్వానీ, సబా ఖురేషీ కారణంగానే చనిపోతున్నాను. వచ్చే జన్మలో మళ్లీ మీకు కొడుకులా పుట్టాలని వేడుకుంటున్నాను’’ అని లేకలో పేర్కొన్నాడు రాజ్. గత 18 నెలలుగా మూడు కోట్లు వసూలు చేశారని.. కంపెనీ నుంచి చాలా సార్లు డబ్బులు ట్రాన్ స్ఫర్ర చేయించుకున్నారని చెప్పాడు. 

ఇక గత కొన్ని నెలలుగా రాజ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని.. పోలీసులకు చెప్పారు అతని తల్లిదండ్రులు. రాజ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి  దర్యాప్తు ప్రారంభించారు ముంబై పోలీసులు.