
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ ( SS Rajamouli ) , సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) కాంబోలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' SSMB29 ' పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొంతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు గురించి ఏ చిన్నపాటి ఆప్ డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఒక వార్త సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఆకస్తిని రేకెత్తిస్తోంది. అదేంటంటే , ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు మాధవన్ నటించబోతున్నారన్న సమాచారం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
అయితే మహేష్ బాబు తండ్రి పాత్రకు తొలుత తమిళ హీరో చియాన్ విక్రమ్ (Vikram ) కు నిర్మాతలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ అనుకోని కారణాలతో ఈ 'SSMB29' ప్రాజెక్టులో భాగం కావడానికి ఆయన రిజక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆర్. మాధవన్ (R Madhavan ) సంప్రదించడంతో ఆయన ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు SSMB29 నిర్మాతలు కానీ, నటుడు కానీ ఎలాంటి అధికార ప్రకటన మాత్రం చేయలేదు.
ఈ 'SSMB29' ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతుందని గతంలోనే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్యూలో ధృవీకరించారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ బాబుకు ధీటైన, అనుభవజ్ఞుడైన ఒక తండ్రి పాత్ర అవసరం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే, మాధవన్ పేరును తెరపైకి వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.
►ALSO READ | Hari Hara Veera Mallu: ‘కుబేర’, ‘కన్నప్ప’ ఎఫెక్టేనా..? పవన్ ఫ్యాన్స్ ఖుషీ.. ‘హరిహర వీరమల్లు’ రన్ టైం ఎంతంటే..
రాజమౌళి సినిమా అంటేనే ప్రతీ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ప్రతీ నటుడిని వారి పాత్రకు తగ్గట్టుగా ఎంచుకుంటారు. ఎక్కడా చిన్న లోపం లేకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తారని పేరు ఉంది. ఈ చిత్రంలో నటీనటుల విషయంలోనూ చాలా గోప్యంగా ఉంచారు. అటు దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ 'SSMB29 ' మూవీ భారతీయ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. కెన్యాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాపై ఓ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించినట్లు సమాచారం. చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ఇండియన్ మూవీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.