
ఈ మధ్య భర్తలను భార్యలే చంపుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి... వివాహేతర సంబంధాలు, ఆస్థి గొడవలు ఇలా.. కారణం ఏదైనా కానీ.. బలవుతుంది మాత్రం భర్తలే అని చెప్పాలి. ఏపీలో జరిగిన ఈ ఘటన మాత్రం వాటన్నిటికంటే దారుణమని చెప్పాలి. తల్లికి వందనం డబ్బుల విషయంలో గొడవపడి.. భర్తకు విషమిచ్చి చంపింది ఓ భార్య. ఏపీలోని అన్నమయ్య జిల్లా రెడ్డిగాని పల్లెలో జరిగింది ఈ ఘటన. జులై 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఇటీవలే తల్లికి వందనం కింద కూటమి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మద్యం తాగాడని.. కోపంతో భర్తకు విషమిచ్చి చంపింది రమాదేవి అనే మహిళ. భావన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న వంకోళ్ల చంద్రశేఖర్ కు 20 ఏళ్ళ క్రితం రమాదేవితో వివాహం అయ్యింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. చంద్రశేఖర్ మద్యానికి బానిసయ్యి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేయడంతో రమాదేవి పాలెకొండకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ క్రమంలో పిల్లలిద్దరికీ తల్లికి వందనం పథకం కింద రమాదేవి అకౌంట్ లో డబ్బులు పడింది. ఆ డబ్బును ఏటీఎం నుండి డ్రా చేసిన చంద్రశేఖర్ భార్య రమాదేవికి ఇవ్వకపోవడంతో ఇద్దరికీ గొడవ జరిగింది.డబ్బులు ఇవ్వకపోవడంతో చంద్రశేఖర్ ను చంపేందుకు సిద్ధమైంది రమాదేవి. ఈ క్రమంలో జులై 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మద్యం ఇవ్వమని అడిగాడు చంద్రశేఖర్. ఇదే సరైన ఛాన్స్ అని భావించిన రమాదేవి మద్యంలో విషం కలిపి చంద్రశేఖర్ కి ఇచ్చింది. చంద్రశేఖర్ విషం కలిపినా మద్యాన్ని సేవించిన తర్వాత అతన్ని గొంతు నులిమి, కర్రతో కొట్టడంతో చంద్రశేఖర్ కుప్పకూలిపోయాడు. విషం కలిపిన మద్యం తాగడంతో రక్తం కక్కుకొని చనిపోయాడు చంద్రశేఖర్. మరుసటి రోజు ఉదయం రక్తపు మరకలను శుభ్రం చేసి.. ఏమీ తెలియనట్టు కూలి పనికి వెళ్ళింది రమాదేవి.
►ALSO READ | కరోనాతో పెండ్లాం, పిల్లలు పోయారని చెప్పి.. 50 ఏళ్ల ఈమెను పెండ్లాడి.. కెరీర్ మీద ఇలా ఫోకస్ పెట్టావా ?
ఆ తర్వాత ఇంటికి వచ్చిన రమాదేవి చంద్రశేఖర్ మద్యం తాగి చనిపోయాడని అందరిని నమ్మిచింది. కానీ.. చంద్రశేఖర్ శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గొంతు నులమడం, విషం తాగడం వల్ల చంద్రశేఖర్ చనిపోయారని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో రమాదేవిని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన రమాదేవిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.