కుంభమేళా నిర్వాహణకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సరైంది కాదన్నారు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా పేరుతో అలహాబాద్‌లో 4,200 కోట్ల రూపాయలు ఖర్చుచేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రానికి సొంతంగా ఒక మతం అంటూ ఉండదని… అలాంటప్పుడు మత ప్రచారాలు, బోధనలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు ఓ కార్యక్రమానికి హాజరైనప్పడు వారికి మౌలిక సదుపాయలు ఏర్పాటుచేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలు కోసమే ప్రభుత్వం పనిచేయదని, కుంభమేళా అన్నది కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. భక్తుల కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు.
