ఓయో రూమ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి

ఓయో రూమ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి

హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదినగూడలో ఉన్న ఓయో లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి..మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని కడప జిల్లాకు చెందిన జయప్రకాష్ నారాయణ(35)గా పోలీసులు గుర్తించారు.  ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న జయప్రకాష్ నారాయణ.. ఇటీవల కూకట్ పల్లి బాలాజీ నగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. 

మే 25వ తేదీ శనివారం జయప్రకాష్ కనపడటం లేదని..  కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, శనివారం మధ్యాహ్నమే మదీనాగూడలోని ఓయో లాడ్జి రూమ్ లో విషం(ట్యాబేట్లు) తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణంలో  మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.