కేంద్రం శుభవార్త.. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయినవారికి సగం జీతం

V6 Velugu Posted on Aug 21, 2020

క‌రోనా సమయంలో లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. మూడు నెలల పాటు వారి సగటు వేతనంలో 50 శాతాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ నేతృత్వంలోని ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ఐసీ ) బోర్డు . ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈఎస్ఐసీలో ఇప్పటికే సభ్యులైన కార్మికులు తాజా ఆర్థిక సాయానికి అర్హులు అవుతారని కేంద్రం స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 41 లక్షల మంది కార్మికులకు ఈ సాయం లబ్ధి చేకూర్చనుంది.

ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు కరోనా విపత్తు కారణంగా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారికి ఈ నిరుద్యోగ భృతిని ప్ర‌భుత్వం చెల్లించనుంది .రూ.21 వేలలోపు వేతనంతో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఈఎస్ఐసీలో లబ్ధి పొందుతారు. ప్రతినెలా వారి మూలవేతనంలో 0.75 శాతాన్ని ఈ పథకంలో జమచేయనున్నారు. యాజమాన్యాలు కూడా 3.25 శాతం జమచేస్తాయి. వైద్య అవసరాలు, ఔషధాల కోసం ఈ సొమ్మును ఉపయోగించుకోవచ్చు. లబ్ధిదారులు తమ యాజమాన్యాల ద్వారా కాకుండా.. నేరుగా ఈఎస్ఐసీ బ్రాంచిల్లో క్లెయిమ్‌ చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

Tagged unemployment benefit, central govt, three months’ salary, 4 million workers, offer 50%

Latest Videos

Subscribe Now

More News