గూగుల్‌ క్రోమ్ స్టోర్‌ ఎక్స్‌టెన్షన్స్‌తో జాగ్రత్త!

గూగుల్‌ క్రోమ్ స్టోర్‌ ఎక్స్‌టెన్షన్స్‌తో జాగ్రత్త!

సీఈఆర్‌‌టీ–ఇన్ సూచన

న్యూఢిల్లీ: ఇంటర్‌‌నెట్ బ్రౌజింగ్ కోసం వాడే గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌ను ఇన్‌స్టాల్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు సీఈఆర్‌‌టీ సూచించింది. సెన్సిటివ్ యూజర్ డేటాను కలెక్ట్ చేసే టైమ్‌లో 100 మెలీషియస్ ఎక్స్‌టెన్షన్స్‌ను తాము గుర్తించినట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్‌‌టీ–ఇన్) తెలిపింది. మినిస్ట్రీ ఆప్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ పరిధి కిందకు వచ్చే సీఈఆర్‌‌టీ.. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్‌ను డీల్ చేస్తుంది. సీఈఆర్‌‌టీ మెలీషియస్ ఎక్స్‌టెన్షన్స్‌ గురించి వివరిస్తూ.. అవి స్క్రీన్ షాట్స్‌ను తీయగలవని చెప్పింది. అలాగే క్లిప్‌బోర్డును చదవడం, అథెంటికేషన్ కుకీస్‌, కీ స్ట్రోక్స్‌ను తీసుకోవడం, పాస్‌వర్డ్స్‌ను చదవడంతోపాటు కీలకమైన సమాచారాన్ని కూడా తస్కరిస్తాయని పేర్కొంది. అవసరమైన ఎక్స్‌టెన్షన్స్‌ను మాత్రమే యూజర్లు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని, ఇన్‌స్టాలేషన్‌కు ముందు రివ్యూస్ చదవాలని ఏజెన్సీ వివరించింది. కీలకమైన సమాచారాన్ని దొంగిలించడం, పాస్‌వర్డ్స్‌ చదవడంతోపాటు మరికొన్ని హానికర పనుల కోసం హ్యాకర్లు, మెలీషియలస్ డెవలపర్లు గూగుల్ క్రోమ్ స్టోర్‌‌ను చాన్నాళ్లుగా వాడుకుంటున్నారు.