శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో 'తాళ్లపూడి చంద్రకళ' అనే విలేజ్ గర్ల్ పాత్రలో అనస్వర కనిపిస్తుంది. ఇటీవలే ఈ మలయాళ కుట్టికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి స్పందన దక్కించుకుంది.
ఈ క్రమంలోనే మేకర్స్ తాజాగా "చంద్రకళ" పాత్రకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. అదేవిధంగా 'గిరాగిరాగిరాగిరే' అనే ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాటను రవి మిరియాల పాట పాడారు. 'గిరాగిరాగిరాగిరే' అనే పాటను రామ్ మిరియాల తనదైన గొంతుతో పాడారు. ఈ ప్రోమో సాంగ్ క్యూరియాసిటీ తీసుకొచ్చింది.
‘‘ఛాంపియన్ నుండి చంద్రకళ గ్లింప్స్ అందిస్తున్నాము. ఆమె మీ హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఫస్ట్ సింగిల్ గిరాగిరాగిరాగిరే నవంబర్ 25న విడుదలవుతోంది’’ అని మేకర్స్ ట్వీట్ చేశారు. రెట్రో స్టైల్‌లో ఉన్న ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఎవరీ అనస్వర రాజన్:
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ అందం.. పలు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్లో యారియాన్2 లో అనశ్వర మెరిసింది. త్రిషతో కలిసి రాంగీ లో నటించింది. అలాగే, ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జీ బృందావన కాలనీ’ సీక్వెల్లో సైతం నటిస్తుంది. ఆసిఫ్ అలీ నటించిన మిస్టరీ క్రైమ్ డ్రామా 'రేఖచిత్రం'లోను కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సౌందర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న 'విత్ లవ్' మూవీలో హీరోయిన్గా నటిస్తుంది.
ఇకపోతే, ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్గా ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోస్ పోస్ట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్లో ఎలాంటి విజయం అందుకోనుందో చూడాలి మరి!
