కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ అనగానే వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్‌ఫుల్ జోడీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అజిత్ తన 65వ ప్రాజెక్ట్ కోసం మరోసారి శివకే మొగ్గు చూపినట్లు కోలీవుడ్ సమాచారం.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శివ, అజిత్‌తో తన తదుపరి చిత్రం గురించి స్పందించారు. అభిమానులు చాలా కాలంగా తమ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, సరైన సమయంలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు.
ఈసారి స్టోరీ విషయంలో ఓ కొత్త ప్రయోగాన్ని చేయబోతున్నామని శివ హింట్ ఇచ్చారు. సూర్య హీరోగా శివ తీసిన ‘కంగువ’ చిత్రం డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో అజిత్‌తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది.
