అంతా దేవుడి దయ.. ఎమర్జన్సీ ల్యాండింగ్‌పై రాహుల్ గాంధీ ట్విట్

అంతా దేవుడి దయ.. ఎమర్జన్సీ ల్యాండింగ్‌పై రాహుల్ గాంధీ ట్విట్

వాతావరణం అనుకూలించకపోవడంతో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా భోపాల్ విమానాశ్రయంలో ల్యాండైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24 గంటల తరువాత రాహుల్ గాంధీ.. తన తల్లిని ప్రశంసిస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు. 

ఎంతటి వ్యక్తయినా ప్రాణం మీదకు వచ్చినప్పుడు కాసింత బెరుకైతే తప్పక ఉంటుంది. అనుకోని ఆపద ఎదురైనప్పుడు.. ప్రాణాలు కాపాడుకోవడానికి గాబరా పడతారు. కానీ సోనియా గాంధీలో ఆ భయం కాసింతైనా కనిపించలేదంటున్నారు రాహుల్ గాంధీ. ఒత్తిడి ఉన్నప్పుడు తన తల్లి ఎలా ఉంటారో తెలిసేలా ఆయన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

రాహుల్ గాంధీ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి విమానంలో కూర్చున్నట్లు కనిపిస్తోంది. "ఎంత ఒత్తిడిలో ఉన్న మా అమ్మ దయకు ప్రతిరూపంగానే ఉంటుంది.." అని రాహుల్ గాంధీ క్యాప్షన్ జోడించారు.

ALSO READ :గుండెపోటుతో చనిపోయిన ఎమ్మెల్యే.. అప్పటి వరకు బాగానే తిరిగారు..

ఏం జరిగిదంటే..?

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ ఇద్దరూ మంగళవారం బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సమావేశం ముగిసిన వెంటనే ప్రత్యేక ఛార్టర్డ్‌ ఫ్లైట్‌లో బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఫైలెట్ల అత్యవసరంగా విమానాన్ని భోపాల్‌ విమానాశ్రయానికి మళ్లించారు. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.