రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెన్నూరు నియోజకవర్గంలో త్వరితగదిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు వీలైనంత తొందరగా చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. వీడియో ద్వార చెన్నూరు నియోజకవర్గ అధికారులకు సందేశాలు ఇచ్చారు.

 రైతులకు మిల్లర్లు సహకరించాలని ట్రాన్స్ పోర్ట్ కోసం లారీలు ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి శ్రీధర్ బాబును కూడా వడ్లు కొనుగోలు చేయాలని కోరానట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గింజ వడ్లు కొనుగోలు చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామ.