చెన్నూరుకు ధాన్యం స్టోరేజ్ కేంద్రం తెస్త : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరుకు ధాన్యం స్టోరేజ్ కేంద్రం తెస్త :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్​: వచ్చే సీజన్ వరకు చెన్నూరు నియోజకవర్గం పరిధిలో ధాన్యం స్టోరేజ్ కేంద్రం అందుబాటులోకి తెస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఇవాళ మంచిర్యాల జిల్లా  చెన్నూరు మండలం అస్సాద్ లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వడ్ల కొనుగోలు, లారీల్లో లోడింగ్ తీరును తెలుసుకున్నారు.  రైతులతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వడ్లను తూర్పాల పట్టి   నాణ్యమైన ధాన్యాన్ని  మిల్లర్ల కు అందించేందుకు సహకరించాలన్నారు.  ఓత్కులపల్లి లో రెండు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని,  రైతుల డిమాండ్ మేరకు మరో కేంద్రం  ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే వివేక్ ఆదేశించారు. అలాగే గ్రామంలో రోడ్లు, బోర్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Also read :లిక్కర్ కేసు అప్ డేట్: కవితకు ఎదురు దెబ్బ