- మొదటి విడత ఎన్నికలకు ముగిసిన
- నామినేషన్ల ఉపసంహరణ
- విత్‌డ్రాలకు ముందుకు రాని క్యాండిడేట్లు
- అర్ధరాత్రి వరకు కొనసాగిన అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు
మహబూబ్‌నగర్, వెలుగు : మొదటి, రెండో విడత ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగనుంది. ఈ విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల విత్ డ్రా ఉండగా, చాలా గ్రామ పంచాయతీల్లో క్యాండిడేట్లు వారి నామినేషన్లను వెనక్కి తీసుకోవడానికి ముందుకు రాలేదు. వారితో చర్చలు జరిపినా.. పదవులు ఆశ చూపినా.. ఫలితం లేకుండాపోయింది. అయితే ఎన్నికల బరిలో ఉండే క్యాండిడేట్లు వివరాలు, వారికి గుర్తులు కేటాయించడానికి రాత్రి వరకు ఆఫీసర్లు కసరత్తు చేశారు.
ఇప్పటి వరకు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని 139 గ్రామ పంచాయతీలు, నారాయణపేట జిల్లాలోని 67 గ్రామ పంచాయతీలను కలుపుకొని మొత్తం 206 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జిల్లాల్లోని 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వనపర్తి జిల్లాలో మొత్తం 2 గ్రామాలు. గద్వాల జిల్లాలో 15 గ్రామాలు, నాగర్‌కర్నూల్‌జిల్లాలో మొత్తం14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ప్రచారం షురూ..
మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో బుధవారం రాత్రి క్యాండిడేట్లు ఫైనల్ కావడంతోపాటు గుర్తులు రావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. వారికి కేటాయించిన గుర్తుల ఆధారంగా కరపత్రాలు, స్టిక్కర్లు, డోర్స్టిక్కర్లు, బ్యానర్లు, టీ షర్టులు, వాల్ పోస్టర్లు, టోపీలను ఆర్డర్ చేస్తున్నారు. కొందరు క్యాండిడేట్లు వారికి కేటాయించిన గుర్తులను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఫలానా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి ప్రచార పర్వం మరింత ఊపందుకోనుంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడత నామినేషన్లు..
మండలం జీపీ నామినేషన్లు వార్డులు నామినేషన్లు
- హన్వాడ 35 233 302 747
- సీసీకుంట 18 143 174 497
- దేవరకద్ర 18 124 168 380
- కోయిల్‌కొండ 44 258 380 814
- కౌకుంట్ల 12 80 106 240
- మిడ్జిల్ 24 149 204 463
నారాయణపేట జిల్లాలో..
నారాయణపేట 28 189 268 614
దామరగిద్ద 30 164 284 566
ధన్వాడ 20 118 182 430
మరికల్ 17 104 165 412
రెండో విడత నామినేషన్లు ఇలా..
వనపర్తి జిల్లాలో..
మండలం జీపీ నామినేషన్లు వార్డులు నామినేషన్లు
ఆత్మకూరు 13 108 118 300
అమరచింత 14 98 120 270
కొత్తకోట 24 190 220 544
మదనాపూరు 17 125 162 353
వనపర్తి 26 220 230 591
గద్వాల జిల్లాలో
మండలం జీపీ నామినేషన్లు వార్డులు నామినేషన్లు
అయిజ 28 171 270 532
మల్దకల్ 25 168 242 551
రాజోలి 11 66 110 253
వడ్డేపల్లి 10 50 94 169
