వావ్ వీడియో సూపర్ : జాతీయ గీతం పాడి వరల్డ్ గిన్నిస్ రికార్డ్

వావ్ వీడియో సూపర్ : జాతీయ గీతం పాడి వరల్డ్ గిన్నిస్ రికార్డ్

గ్రామీ అవార్డ్ విజేత రికీ కేజ్ మరో గొప్ప ఘనత సాధించారు. గ్రాండ్ ఆర్కెస్ట్రా, 14000 మంది పిల్లలతో, వివిధ సంగీత వాయిద్యాలతో జాతీయ గీతాన్ని రికార్డ్ చేశాడు. అది ఆగస్ట్ 14న గిన్నీస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ లో చోటు దక్కించుకుంది. ఒడిషా నుంచి వచ్చిన 14 వేల గిరిజన విద్యార్థులు ఈ రికార్డింగ్ లో జాతీయ గీతం ఆలపించారు.

అంతే కాదు.. లండన్ నుంచి 100 పీస్ రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో జాతీయ గీతానికి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. నిమిషం 28 సెకండ్ల వీడియోను రికీ కేజ్ ఎక్స్ లో షేర్ చేశాడు.. ఈ ప్రొగ్రామ్ చేయడానికి కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ వారు కూడా హెల్ప్ చేశారు.

Xలో వీడియో షేర్ చేస్తూ, రికీ కేజ్ ఇలా రాశారు..  మన జాతీయ గీతాన్ని పురాణ పద్దతిలో ప్రదర్శించడం నా గౌరవంగా భావిస్తున్నాను. ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసులు,- 100 ముక్కల బ్రిటిష్ ఆర్కెస్ట్రా మరియు 14000 మంది గిరిజన పిల్లలు టీం గా కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డును గెలుచుకున్నాము. దయచేసి ఈ వీడియోను చూసి, షేర్ చేయండి.. ప్రతి భారతీయుడికి నేను ఇచ్చే వినయపూర్వకమైన బహుమతి ఇదే.. జై హింద్.. అని రికీ కేజ్ తన ఎక్స్ అఫీషియల్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేశాడు.