పోలీసుల చెకింగ్.. మెదక్ జిల్లాలో పట్టుబడ్డ రూ.30.59 లక్షలు

పోలీసుల  చెకింగ్.. మెదక్ జిల్లాలో పట్టుబడ్డ రూ.30.59 లక్షలు

మెదక్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లాలో పోలీసుల వెహికల్ చెకింగ్ లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది.  మంగళవారం చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో  ఫ్లయింగ్ స్వ్కాడ్  టీమ్ ​చేగుంట, గజ్వేల్ రూట్లో  మక్కరాజ్ పేట వద్ద వెహికల్ చెకింగ్  చేస్తున్న సందర్భంగా బుల్లెట్ పై చేగుంట వైపు వస్తున్న గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి  చెందిన గుండెల్లి యాదగిరి, శిరీష దంపతులను ఆపి తనిఖీ చేశారు. వారివద్ద  రూ.30,59,500  గుర్తించారు. ఆ నగదు గురించి వారు స్పష్టమైన వివరణ ఇవ్వక పోవడంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న నగదును  సంబంధిత అధికారులకు అప్పగించారు.