
ఆదిలాబాద్‌టౌన్/బెల్లంపల్లి/నేరడిగొండ/బజార్హత్నూర్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కులమతాలకు అతీతంగా మొహర్రం వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పుల్ల మధ్య ఆటపాటలతో గ్రామాల్లో పీరీలను ఊరేగించారు. తలమడుగు మండలం రుయ్యాడిలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పాల్గొని పూజలు చేశారు. మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బోథ్‌లో నిర్వహించిన వేడుకలలో రాష్ట్ర డైరీ మాజీ చైర్మన్లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొహర్రం వేడుకలను బెల్లంపల్లి పట్టణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పాత బస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు పీర్లను ఊరేగించగా భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. బెల్లం షర్బత్ పంపిణీ చేశారు. బజార్ హత్నూర్ తోపాటు మండలంలోని దేగామ, కొల్హారి, పిప్పిరి, గిర్నూర్, కాండ్లీ, గోకొండ, జాతర్ల, మోర్ఖండిలో పీరీల ఉత్సవ సందడి కొనసాగింది. నేరడిగొండ మండలంలోని వడూర్, కుమారి, కుప్టి, కుంటాల గ్రామాల్లో మొహర్రంను ఘనంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూజలు చేశారు.