గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్

గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్

స్వర్గీయ  నందమూరి  తారకరామారావు పేరుతో  ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’  కార్యక్రమం శనివారం సాయంత్రం  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగింది.  ఆర్వీ రమణ మూర్తి, రాఘవి మీడియా  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప,  మురళీ మోహన్,  తెలుగు చలనచిత్ర  నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్,   ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్  మాదాల రవి పాల్గొన్నారు. 

ఎన్టీఆర్ ఫిల్మ్  లైఫ్ టైం అచీవ్‌‌‌‌‌‌‌‌మెంట్ అవార్డును మురళీమోహన్ అందుకున్నారు. బెస్ట్ హీరో అవార్డును ‘బేబీ’ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, బెస్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సాయి రాజేష్​ అవార్డ్స్ అందుకోగా, బెస్ట్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘భగవంత్ కేసరి’ నిర్మాత సాహు గారపాటి అవార్డులు అందుకున్నారు. అలాగే  ఉత్తమ విలన్‌‌‌‌‌‌‌‌గా యక్షిని వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా  దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా పలువురు ఎన్టీఆర్ ఫిల్మ్  పురస్కారాలను గెలుచుకున్నారు.