
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న భోళాశంకర్ (Bhola Shankar) మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా భోళాశంకర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసేందే. లేటెస్ట్ గా ప్రీ-రిలీజ్ కు సర్వం సిద్ధంమైంది అంటూ మేకర్స్ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇవాళ (ఆగష్టు 6న) హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ఈవెంట్ సాయంత్రం 7 గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ కానుందని తెలిపారు. –
ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు. దీంతో మెగా ఈవెంట్ ను చూడటానికి చిరంజీవి ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుండటంతో పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేయునున్నారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది మేకర్స్ ప్రకటించలేదు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ అండ్ సాంగ్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ భోళా మాస్ ఎంటర్టైనర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ పైన ఫోకస్ పెట్టారు మేకర్స్.
తమిళ చిత్రం వేదాళం కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ అన్న చెల్లెళ్ల సెంటిమెంట్ తో రాబోతుంది. ఈ సినిమాలో తమన్నా (tamanna bhatia) హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరుకు చెల్లెలు పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerti suresh) కనిపించనుంది. టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ మూవీని.. ఏకె ఎంటెర్టైన్మెంట్స్ (AK Entertinements) బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర(Rama brahmam sunkara) నిర్మిస్తున్నారు.
Celebrate the Boss of Mass War Zone with your love, Tomorrow with the Grand Pre-Release Celebrations of #BholaaShankar ? from 7PM.
— AK Entertainments (@AKentsOfficial) August 5, 2023
? Shilpakala Vedika, Hyd
Mega?@KChiruTweets
A film by @MeherRamesh@AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati… pic.twitter.com/ZT65Vu8s1m