ఆసరా పెన్షన్ కోసం దాడి

ఆసరా పెన్షన్ కోసం దాడి
  • వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • మనవడిని అరెస్ట్ చేసిన పోలీసులు 

వికారాబాద్, వెలుగు: పెన్షన్ పైసల కోసం నాయనమ్మను ఓ మనవడు కాళ్లతో తన్నిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్​లో జరిగింది. రెండ్రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన  వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.  వివరాలిలా ఉన్నాయి.. మంబాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు చింది య‌‌‌‌‌‌‌‌శోద‌‌‌‌‌‌‌‌మ్మ(70)కు ఆసరా పెన్షన్ వస్తోంది.  రెండ్రోజుల కిందట ఆమెకు పెన్షన్​రాగా ఆ డబ్బులను ఇవ్వాలంటూ మనవడు గోవర్ధన్  మద్యం మత్తులో  ఆమెపై దాడి చేశాడు. కాళ్లతో తన్నుతూ హింసించాడు. తర్వాత కట్టెతో కొట్టాడు. రూ.2 వేలను బలవంతంగా లాక్కుని వెళ్లిపోయాడు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్​గా మారడంతో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వికారాబాద్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తాండూరు డీఎస్పీ శేఖ‌‌‌‌‌‌‌‌ర్ గౌడ్ ఆదేశాలతో ఎస్ఐ అబ్దుల్​రవూఫ్ ​శుక్రవారం ఉదయం పరారీలో ఉన్న గోవర్ధన్​ను అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసైన గోవర్ధన్ వైఖరి కారణంగా అతడిని భార్య వదిలేసి వెళ్లినట్లు గ్రామస్థులు చెప్తున్నారు.