వరాలిచ్చే లక్ష్మీ.. రావమ్మా మా ఇంటికి..

వరాలిచ్చే లక్ష్మీ.. రావమ్మా మా ఇంటికి..

మహిళలకు శ్రావణమాసం ఎంతో ప్రత్యేకం. ఈ నెలలో అమ్మవారిని పూజించి, వ్రతాలు చేస్తారు. ముత్తయిదువులను ఇంటికి పిలిచి వాయనాలు ఇస్తారు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (రెండో శుక్రవారం)చాలా ప్రత్యేకం. ఆ రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు.  ఈ క్రమంలోనే ఇంట్లో, పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. లక్ష్మీదేవీ అమ్మవారిని అలంకరించి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో వరలక్ష్మీ శోభ కనిపిస్తుంది. భక్తులతో ఆలయాలన్ని కిటకిటలాడుతున్నాయి.

వరలక్ష్మీ వ్రతం కథ..!
చారుమతి అనే పుణ్యవతి తల్లిదండ్రులను, అత్త మామలను సేవిస్తూ భర్త పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ వినయ విధేయతలతో ఉండేదట. చారుమతి కలలో ఒక రోజు వరలక్ష్మీ అమ్మవారు కనిపించి నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము నన్ను పూజిస్తే అష్టైశ్వర్యాలు పొందుతావని చెప్పి అదృశ్యమైందట.  అలా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది చారుమతి.  అలా అప్పటినుంచి ప్రతిఒకరు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారని పురాణాలు చెప్తున్నాయి.