నడిరోడ్డుపై పడ్డ గ్రానైట్ ​బండ

నడిరోడ్డుపై పడ్డ గ్రానైట్ ​బండ

గంగాధర, వెలుగు: కరీంనగర్​– జగిత్యాల హైవే గంగాధర మండలం మధురానగర్​ చౌరస్తాలో లారీ నుంచి ఓ గ్రానైట్​ బండ నడిరోడ్డుపై పడింది. గ్రానైట్ లారీ ట్రాలీ ఇంజిన్ నుంచి వేరుకావడంతో బండ జారిపడ్డట్టు స్థానికులు తెలిపారు. గ్రానైట్​లారీ జగిత్యాల రూట్ నుంచి బోయినపల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగిందని ఎస్సై అభిలాష్​​​ తెలిపారు. రోడ్డుపై పడ్డ రాయిని పోలీసులు భారీ క్రేన్ తో తొలగించారు.