హైదరాబాద్ లో ఓటర్లు 91 లక్షలు

హైదరాబాద్ లో ఓటర్లు 91 లక్షలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ లోని 24  అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 91,83,930 మంది ఓటర్లు ఉన్నారు. గత జనవరి 5న సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం 89,00,186 మంది కాగా, ప్రస్తుతం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల తుది జాబితాలో 91,83,940 మందికి పెరిగారు. ఇందులో కొత్తగా 2,83,744 మంది చేరారు. తుది జాబితాను చూస్తే హైదరాబాద్ జిల్లాలో 44,42,458 మంది ఓటర్లకుగాను పురుషులు 22,79,581, మహిళలు 21,62,577, ఇతరులు 300 మంది ఉన్నారు.

గ్రేటర్ పరిధిలోకి వచ్చే మేడ్చల్ జిల్లాలోని 4 సెగ్మెంట్లలో మొత్తం 20,95,785 మంది ఓటర్లకు గాను పురుషులు 10,88,179, మహిళలు 10,07,287, ఇతరులు 319 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో మొత్తం 26,45,687 ఓటర్లకుగాను పురుషులు 13,78,956 , మహిళలు 12,65,848,  ఇతరులు 378 మంది ఉన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.