
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ (2) రూ.33 వేలకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.45 వేల దగ్గర లాంచ్ చేసింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల 8 నుంచి 15 మధ్య జరగనుంది. మరోవైపు అమెజాన్ కూడా ఈ నెల 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించనుంది. ప్రైమ్ యూజర్లు అక్టోబర్ 7 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.9 వేల నుంచే అందుబాటులో ఉంటాయని అమెజాన్ వెల్లడించింది.