వంద ఎకరాల్లో బస్ స్టేషన్.. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్

వంద ఎకరాల్లో బస్ స్టేషన్.. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్
  • రూ.240 కోట్లతో త్వరలో పనులు ప్రారంభం 
  • ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టును  మరిపించేలా సకల సౌకర్యాలు 
  • ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక డిపో, చార్జింగ్ స్టేషన్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలపించేలా ఓ బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపుదిద్దుకోబోతోంది. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఆధునాతనమైన సౌకర్యాలతో ఈ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే వంద ఎకరాల స్థలాన్ని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ తెలంగాణ ఆర్టీసీకి అప్పగించారు. దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. 

దీనికి సంబంధించిన నిధుల క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధిత శాఖకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. రెండేండ్లలో ఈ బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా రూపొందించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ సిటీలో రవాణా వ్యవస్థను శివారు ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతో గాజుల రామారంలో ఈ బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి, ఇతర ముఖ్య పట్టణాల నుంచి సిటీకి వచ్చే బస్సుల సంఖ్య పెరగడం, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ బస్సులు చిక్కుకోవడం, ప్రయాణ సమయం పెరగడం.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని శివారు ప్రాంతంలో మరో నూతన బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

  • భూగర్భంలో వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఎయిర్ పోర్టును మరిపించే రీతిలో భారీ షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మించనున్నారు. బయటి వాహనాలకు పార్కింగ్ సమస్య లేకుండా ఉండేందుకు భూగర్భంలోనే భారీ పార్కింగ్ యార్డును నిర్మించనున్నారు. సిటీ బస్సులను ఈ బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ నుంచి సిటీ నలువైపులకు నడిపేలా సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సిటీ టెర్మినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నారు. 

మరో 30 ఎకరాల్లో అంతర్రాష్ట్ర బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెర్మినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఎలక్ట్రిక్ బస్సులదే కావడంతో 10 ఎకరాల్లో ఈవీ బస్సు డిపో, మరో 15 ఎకరాల్లో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ అత్యాధునిక బస్సు స్టేషన్ నిర్మాణం పూర్తయితే సిటీకి ఇతర ప్రాంతాల బస్సులు రావడం తగ్గనుంది. దీంతో వాయు కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.