ఈ ఇల్లు సల్లగుండ

ఈ ఇల్లు సల్లగుండ

ఇటలీలోని మిలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 111 మీటర్ల  రెండు టవర్ల నిండా చెట్లు, పొదలే

అడవులను మస్తు చూసుంటరు. అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఫారెస్టులను చూశారా? ఇటలీలోని మిలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లండి. చూసి ఆశ్చర్యపోతారు. 111 మీటర్ల ఎత్తున్న రెండు టవర్ల నిండా చెట్లు, పొదలు, మొక్కలే. రెండు బిల్డింగుల్లో కలిపి 900కు పైగా చెట్లు, 5 వేలకు పైగా పొదలు, 11 వేలకు పైగా మొక్కలున్నాయి. మరి ఎందుకిలాంటి ఇండ్లు? ఏం లాభం వీటి వల్ల? మన ఆరోగ్యాన్ని, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఏమైనా బాగు చేస్తాయంటారా? ఆ బిల్డింగుల్లో ఉంటున్న వాళ్లనే అడిగితే తెలిసిపోద్ది. అక్కడి రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమోనా పిజ్జి.. ‘ఈ అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతం. ఇందులో ఉండటం మరింత అద్భుతం. స్వచ్ఛమైన గాలి, కావాల్సినంత వెలుతురు వస్తోంది. చెట్లు, మొక్కలు ఉండటం వల్ల ఎండాకాలమైనా కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటోంది’ అన్నారు.

పక్షులు కూడా మస్తుగ వస్తయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బిల్డింగుల్లోని చెట్లు వేడిని ఎంతవరకు పీల్చుకుంటాయి? అంటే ఎండాకాలంలో టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త, ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లౌరా గట్టి అన్నారు. చెట్లను పెంచితే గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించలేమని, ఇలాంటి పద్ధతులూ కాస్త ఉపయోగపడతాయని చెప్పారు. బిల్డింగులో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెట్టు పెరిగి రెండు నెలలయ్యాక దానిపై ఓ పక్షి గూడు కనబడిందని, బిల్డింగులో పని జరుగుతున్నా ఆ పక్షి పూర్తి గూడును కట్టుకుందని లౌరా అన్నారు. కొద్ది నెలల్లోనే పక్షులు, సీతాకోకచిలుకలు విపరీతంగా పెరిగాయన్నారు. కీటకాలైతే ఎక్కువగా కనబడలేదని అక్కడ ఉంటున్న వాళ్లు చెప్పారు. ఇంకేముంది.. త్వరలో ఇలాంటి బిల్డింగులను మన సిటీలోనూ చూడబోతున్నామన్నమాట.

చెట్లుంటేనే సల్లగుంటది

2030 నాటికి ప్రపంచంలోని 60 శాతం మంది ప్రజలు సిటీల్లోనే ఉంటారు. కాబట్టి జనం, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగి కాలుష్యం ఎక్కువై నగరాల్లో ఉడికిపోతాయి. దీన్నుంచి తప్పించుకోవాలంటే చెట్లే మార్గం. ఈ బోస్కో వర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సిటీల్లో చాలావరకు వేడి తగ్గించవచ్చు. బిల్డింగుల్లోని చెట్లు, మొక్కలు కార్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైఆక్సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పీల్చుకుని ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇస్తాయి. కాబట్టి సిటీలు ‘హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లు అయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా తక్కువ. బిల్డింగులను కట్టిన స్టెఫనో బొయెరీ మాట్లాడుతూ.. ‘వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు ఇలాంటి బిల్డింగులను డిజైన్‌‌‌‌ చేస్తున్నాం. మెక్సికో, చైనా, ఈజిప్టు, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ప్రాజెక్టులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాం. ఇలాంటి బిల్డింగుల్లో ఫ్లాట్ల ధరలూ తక్కువే ఉంటాయి’ అని చెప్పారు.