గ్రీన్​లాండ్​ వాటర్​ వాకింగ్​!

గ్రీన్​లాండ్​ వాటర్​ వాకింగ్​!

గ్రీన్​లాండ్​ అంటేనే మొత్తం ఐస్​. ఆ ఐస్​పై కుక్కలతో సామగ్రిని తరలిస్తుంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో గ్రీన్​లాండ్​లో ఐస్​ కరిగి నీరైంది. ఆ నీటిలోనే ఇప్పుడు కుక్కలు సైంటిస్టుల సామగ్రిని తీసుకెళుతున్నాయి. గురువారం గ్రీన్​లాండ్​లోని ఇంగిల్​ఫీల్డ్​ బ్రెడ్నింగ్​ ఫోర్డ్​లో కనిపించిన చిత్రమిది. పర్యావరణ మార్పులు ఎంతలా గ్రీన్​లాండ్​ను ప్రభావితం చేస్తున్నాయో చెప్పేందుకు ఈ ఫొటోనే ఉదాహరణ అంటున్నారు నిపుణులు. రాస్మస్​ టోన్బో అనే సైంటిస్టుల ఈ ఫొటోను ట్వీట్​ చేశారు.