ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గోదావరి రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు(జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ) సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 30న నిర్వహిస్తామని సభ్యులకు మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ అజగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శనివారం లెటర్ రాశారు. జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2లోని ప్రాజెక్టుల అప్పగింత, వాటి ఫ్లో చార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిర్వహణకు అవసరమైన సిబ్బంది బదలాయింపు, రెండు రాష్ట్రాలు రూ.20 కోట్ల చొప్పున సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీ విడుదల తదితర అంశాలపై చర్చించనున్నట్లు లేఖలో ప్రస్తావించారు.  బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవడం, దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ.20 కోట్ల సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీ కోరడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.