ఆన్ లైన్లో కూడా దొరకని గ్రోసరీస్

ఆన్ లైన్లో కూడా దొరకని గ్రోసరీస్
  • ఆర్డర్ తీసుకున్నా.. సర్వీస్ లేదని డిస్ ప్లే
  •  ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. సేవలకు నై

ఆన్ లైన్ లో నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. గ్రోసరీస్ అమ్ముకోవ చ్చని ఈ కామర్స్ సంస్థ లకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. అయినా ఆ సంస్థలు సేవలు షురూ చేయడం లేదు. కొన్ని సంస్థ ల వెబ్ సైట్, యాప్స్ లలో నో ఆర్డర్స్ బోర్డు డిస్ప్లే చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆన్ లైన్ లో నిత్యావసరాలు కొనుక్కునే పరిస్థితి లేనట్లయ్యింది.

 నో ఆర్డర్..

లాక్ డౌన్ ఉన్నందున అత్వవసర సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ కామర్స్ ద్వారా కూడా నిత్యావసరాలు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. సాధారణ రోజుల్లో ప్రజలు మార్కెట్ కు వెళ్లే టైం లేక ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చేవారు. డెలీవరీ బాయ్స్ చక్కగా ఇంటికి వచ్చి సరకులు డెలివరీ చేసేవారు. ప్రస్తుతం లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థి తి. ఒకవేళ బయటకు వెళ్తే పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. బండి లాక్కుని సీజ్ చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ ఇద్దమనుకుంటే ఈ కామర్స్ సంస్థలు నో ఆరర్ బోర్డులు పెట్టాయి. దీంతో అనేక మంది నిరాశకు గురవుతున్నారు.

బయ్’ ఆప్షన్ ఉన్నా..

అమెజాన్, ఫ్లిప్ కార్, బిట్ గ్ బాస్కెట్, బిగ్ బజార్, గ్రోఫోర్స్ తదితర ఈ కామర్స్ సంస్థలు లాక్ డౌన్ ముందు వరకు నిత్యావసర వస్తువులను విక్రయించాయి. రాష్ట్రంలోని దాదాపు 200 నుంచి 300 ప్రాంతాల్లో ఈ కామర్స్ సంస్థ లకు విని యోగదారులు ఉన్నారు. నిత్యావసర వస్తువులు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య బాగానే ఉండేది. కొన్ని కంపెనీలు నేరుగా నో ఆర్డర్ బోర్డులు పెడితే, మరికొన్ని సంస్థలు మాత్రం తెలివిగా వ్యవహరిస్తున్నాయి. ఒకటి, రెండు సంస్థలు మాత్రం గ్రోసరీస్ కొనుగోలు చేసేలా ఆప్షన్లు ఇస్తున్నా, పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి ‘ మీరున్న ప్రదేశంలో ప్రస్తుతం సేవలు అందించలేం’ అని చూపిస్తున్నాయి. హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాలకూ ఇదే పరిస్థితి.