పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి.. ఇప్పుడు వధువుకు కరోనా పాజిటివ్

పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి.. ఇప్పుడు వధువుకు కరోనా పాజిటివ్

కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన ఓ జంటకు.. పెళ్లైన రెండు రోజులకే ఊహించని ఘటన ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఓ యువతీయువకుడి వివాహం పది రోజుల క్రితం జరిగింది. వివాహం జరిగిన రెండు రోజులకే డిసెంబర్ 4న వరుడు అనారోగ్యానికి గురై మరణించాడు. అతనికి కరోనా సోకిందేమోనని బంధువులందరూ అనుకున్నారు. కానీ, అతనికి కరోనా సోకలేదు. ఇప్పుడు వధువుతో పాటు మరో ఎనిమిది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘వరుడు మరణించిన తర్వాత అతని కుటుంబసభ్యులకు కరోనా పరీక్ష నిర్వహించాం. అందులో వధువుకు, ఆమె అత్తకు మరియు మరిదితో సహా కుటుబంలోని తొమ్మిదిమందికి కరోనావైరస్ సోకింది. వరుడు డిసెంబర్ 4న మరణించాడు. కానీ, అతడు కరోనా సోకడం వల్లే చనిపోయాడని చెప్పలేం. ఒకే కుటుంబంలోని 9 మందికి కరోనా సోకడంతో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీతా కులశ్రేస్తా తెలిపారు.

ఫిరోజాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 3,673 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం 171 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని.. కరోనా వల్ల ఇప్పటివరకు 67 మంది మరణించారని డాక్టర్ నీతా తెలిపారు.

For More News..

భర్తను కొట్టి భార్యపై 17 మంది అత్యాచారం

హెల్మెట్ పెట్టుకొని.. హుక్ పెట్టుకోకున్నా ఫైన్

మరో నెలలో పెళ్లనగా తల్లీకూతుళ్లు ఆత్మహత్య