కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఆడిటోరియానికి భూమిపూజ

కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఆడిటోరియానికి భూమిపూజ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ(కఫిసొ) కొత్త ఆడిటోరియం సినీ పరిశోధన కేంద్రం కావాలని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ ఆకాంక్షించారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఫిలిం సొసైటీ విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. కరీంనగర్ పద్మా నగర్ బైపాస్ రోడ్ లో ఫిలిం సొసైటీ ఆడిటోరియం నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు డాక్టర్ పొన్నం రవిచంద్రతో కలిసి శనివారం భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ కఫిసొ పాత ఆడిటోరియం దేశంలో రెండో స్థానంలో ఉందని, కొత్త ఆడిటోరియం నిర్మాణమైతే మొదటి స్థానంలోనికి వస్తుందన్నారు. కార్యక్రమంలో బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, కఫిసొ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గౌతమ్, కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.